నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి:
మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన మట్ల సోమయ్య ని మల్లాపూర్ మరియు వివిధ గ్రామాల కు చెందిన సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు ఎలాల జలపతి రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బద్దం నర్సారెడ్డి,సర్పంచులు ఏలేటి వెంకటరెడ్డి, కనుముల వెంకటేష్,వార్డ్ సభ్యులు, మార్కెట్ డైరెక్టర్లు నూతిపెల్లి రాజాం ,ఎర్ర రమేష్, గాజుల రాజారెడ్డి, నాయకులు కిరణ్, సిరిపురం రవీందర్, యండి జమాల్ డి. ప్రతాప్, రాఘవులు, సురేష్, నత్తి రాము, ఎదలాపురం రమేష్ తదితరులు పాల్గొన్నారు.


