పెగడపల్లి మండల రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవగీతం,జగిత్యాల/పెగడపల్లి:
గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు సాధించి ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యాలు మెరుగు పరుస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం పెగడపల్లి మండలంలో పర్యటించిన మంత్రి అడ్లూరి పెగడపల్లి నుండి ఏడు మోటల పల్లె తండ వరకు రెండు కిలోమీటర్ల మేర రూ.2కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలోని తండాల మీదుగా ప్రధాన రోడ్లకు అనుసంధానం చేస్తూ లింకు రోడ్లు నిర్మాణం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని తండాల మీదుగా రోడ్ల నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

పెగడపల్లి నుండి ఏడు మోటలపల్లి తండా రోడ్డు నిర్మాణానికి స్థానిక రైతులు సహకరించాలని మంత్రి కోరారు. రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పగడపల్లి మండలంలోని రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. పెగడపల్లి మండలం కీచులాటపల్లి గ్రామంలో మంత్రి అడ్లూరు కూరగాయలు కొనుగోలు చేశారు. ధర్మారం, పెగడపల్లి మండలాల్లో సోమవారం పర్యటించిన మంత్రి కీచులాటపల్లిలో కూరగాయలు కొనుగోలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రి తన వద్ద కూరగాయలు కొనుగోలు చేయడంతో సదరు మహిళా వ్యాపారి సంతోషం వ్యక్తం చేసింది.


