రైతులకు ఇబ్బంది కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
నవగీతం,కోరుట్ల ప్రతినిధి:(వి. సంపత్)
జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ ప్రక్రియ పర్యవేక్షణలో భాగంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని కలికోట, అంబారి పేట, తాండ్రియాల, గంబీర్ పూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు.


రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.ధాన్యం తూకం, నిల్వ మరియు రవాణా ప్రక్రియల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రీ ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చుడాలని అన్నారు. అదేవిధంగా మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.అలాగే రైతులు విక్రయించిన ధాన్యం సకాలంలో మిల్లులకు చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జివాకర్ రెడ్డి , డిసిఓ మనోజ్ కుమార్, తహసీల్దార్ లు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


