Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమహిళల భద్రత, సాధికారతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

మహిళల భద్రత, సాధికారతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని రేచపల్లీ గ్రామంలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక – ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, హక్కులు, సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించారు. ముఖ్యంగా బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమం, ఆడపిల్లల విద్య ప్రాముఖ్యత, మంచి స్పర్శ – చెడు స్పర్శ అంశాలు, మొబైల్ వినియోగ వ్యసనం, సామాజిక మాధ్యమాల దుష్ప్రభావాలపై వివరించారు. అలాగే మహిళల రక్షణ చట్టాలు, బాలల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టం, గృహ హింస నిరోధక చట్టం, వరకట్న నిషేధ చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అందుబాటులో ఉన్న పలు ఆర్థిక పథకాల గురించి వివరించారు.మిషన్ వాత్సల్య పథకం, దత్తత ప్రక్రియపై సమాచారం అందించడంతో పాటు మహిళల రక్షణకు ఉపయోగపడే సహాయ కేంద్రాల సంఖ్యలను తెలియజేశారు. పోలీసు సహాయ కేంద్రం 100, సఖి కేంద్రం 181, బాలల సహాయ కేంద్రం 1098, అంతర్జాల నేరాల సహాయ కేంద్రం 1930, వయోవృద్ధుల సహాయ కేంద్రం 14567, మాదక ద్రవ్యాల వ్యసన నివారణ సహాయ కేంద్రం 14416 సంఖ్యలను ప్రజలకు వివరించారు.మహిళల అభివృద్ధి, భద్రత, స్వయం సాధికారత లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని మహిళా సాధికారత కేంద్రం బృందం తెలిపింది. ఈ కార్యక్రమంలో జెండర్ నిపుణులు స్వప్న, గౌతమి, ఆర్థిక అవగాహన సమన్వయకర్త హేమశ్రీ పాల్గొని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్, క్షేత్ర సహాయకుడు, ఉపాధి హామీ కార్మికులు, మహిళా సాధికారత సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular