నవగీతం: వైరా ప్రతినిధి:
వైరా మండలంలోని విప్పలమడక గ్రామంలో గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన బూర్గు బాయమ్మ దహన సంస్కారాల కోసం ఆ గ్రామానికి చెందిన మేడా శంకరయ్య సుశీలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయాన్ని అందజేసింది. శుక్రవారం మృతురాలి బంధువులకు మాజీ సర్పంచ్ తుమ్మల జాన్ పాపయ్య చేతుల మీదగా ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 5 వేలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొల్లికొండ వీరభద్రరావు, మాజీ ఉప సర్పంచ్ వీరపనేని చెన్నకేశవరావు, వార్డు మెంబర్ బూర్గు నందిని, మేడా సంపత్, వీరపనేని తిరుపతయ్య, ఈలప్రోలు వేణు, ఏసు కృపా, బూర్గు యోహాన్ తదితరులు పాల్గొన్నారు.

