Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమృతుల కుటుంబాలను పరామర్శించిన పునుగొటి కృష్ణారావు

మృతుల కుటుంబాలను పరామర్శించిన పునుగొటి కృష్ణారావు

📰 Generate e-Paper Clip

నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి:

కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో అనారోగ్య కారణాలతో మృతిచెందిన రేగుల మల్లవ్వ, కోలాపురం సురేష్ కుటుంబాలను మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పునుగొటి కృష్ణారావు పరామర్శించారు. మృతుల నివాసాలకు వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఆవేదనను విన్న ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.అనారోగ్యంతో కుటుంబ పెద్దలను కోల్పోవడం ఎంతో బాధాకరమని పేర్కొన్న పునుగొటి కృష్ణారావు, గ్రామ ప్రజలు పార్టీ నాయకులు కుటుంబాలకు అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు లాగెల రాజేశం, గోలి అంజయ్య, మాజీ సర్పంచ్ సోలోమన్, మల్లేశం, మైపాల్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నరసయ్య, తో పాటు మల్లయ్య, నవీన్, రాజేశ్వరి, సుకుమార్, సురేష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మృతుల కుటుంబాలకు తమ సానుభూతిని తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular