నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
దుబాయ్‌లో ఆదివారం నిర్వహించిన (ఇండియన్ పీపుల్స్ ఫోరం) సమావేశంలో జగిత్యాల పట్టణానికి చెందిన ఆరే శరత్ గౌడ్ ని తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా నియమిస్తున్నట్లు ఐపిఎఫ్ అధ్యక్షులు జితేంద్ర వైద్య ప్రకటించారు.నియామక అనంతరం ఆరే శరత్ గౌడ్ మాట్లాడుతూ, ఐ పీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించడం తనకు గర్వకారణమని తెలిపారు.ఈ అవకాశాన్ని కల్పించిన ఐపీఎఫ్ అధ్యక్షులు జితేంద్ర వైద్య , నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ గారికి, అలాగే ఐపీఎఫ్ సీనియర్ నాయకులు కుంబల మహేందర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.భవిష్యత్తులో ఐపీఎఫ్ సంస్థ బలోపేతానికి, గల్ఫ్ దేశాల్లోని భారతీయ కార్మికుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాజ నవనీత్, మదన్, నిమ్మల కృష్ణ, పెనుకుల అశోక్, వేణుగోపాల్, యోగేష్, జగదీష్, విష్ణు, గోవర్దన్, అజయ్, దశరథం తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

