Saturday, May 30, 2026
ads
Homeఖమ్మంమహానాడు వేదికగా లక్ష రూపాయల విరాళం ప్రకటించిన వనమా వాసు

మహానాడు వేదికగా లక్ష రూపాయల విరాళం ప్రకటించిన వనమా వాసు

📰 Generate e-Paper Clip

నవగీతం: ఖమ్మం ప్రతినిధి:

ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు వనమా వాసు తెలుగుదేశం పార్టీ కి ఒక లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది.మహానాడు వేదిక నుండి విరాళం ప్రకటించిన వారి పేర్లను జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  స్వయంగా చదివి  వినిపించారు.ఖమ్మం జిల్లా నుండి విరాళం అందించిన ఏకైక తెలుగుదేశం పార్టీ నాయకుడు వనమా వాసు అని అన్నారు.ఈ సందర్భంగా వనమా వాసు మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ జిల్లాలో అభివృద్ధికి నా వంతు బాధ్యతగా కృషి చేస్తా అని తెలుగుదేశంపార్టీ ఖమ్మం జిల్లాల పార్టీ బలోపేతానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని,రాబోయే రోజుల్లో బీఆర్ఎస్, పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, అలాగే ఇచ్చిన హామీలు అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని ఇలాంటి సమయంలో టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, తమ తమ ప్రాంతాలలో తెలుగుదేశంపార్టీ పరిపాలనలో స్వర్గీయ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మున్ముందు పార్టీ బలోపేతానికి శ్రమించాలని అన్నారు. వాసును టీడీపీఅభిమానులు అభినందిస్తూ. గ్రామ గ్రామాన పార్టీ దిమ్మెలకు సహాయం, అన్న విగ్రహాలకు దాతగా సహకరిస్తున్నారని, ఎంతో మందికి సహాయం చేశారు. సందర్భంగా పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆయనను అభినందించారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular