Monday, August 3, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలమెట్ పల్లి మున్సిపల్ ముట్టడిస్తాం

మెట్ పల్లి మున్సిపల్ ముట్టడిస్తాం

📰 Generate e-Paper Clip

అభివృద్ధి పనులు వారం రోజుల్లో ప్రారంభించాలి

బిజెపి పట్టణ అధ్యక్షులు ధోనికెల నవీన్

నవగీతం మెట్ పల్లి ప్రతినిధి:

మెట్ పల్లి మున్సిపల్ పరిధిలోని 26 వార్డులలో అభివృద్ధి పనుల కోసం మంజూరైనటువంటి నిధులతో అభివృద్ధి పనులు వారం రోజుల్లో ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి కార్యక్రమం చేపడతామని బిజెపి పట్టణ అధ్యక్షుడు ధోనికెల నవీన్ హెచ్చరించారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు ధోనికెల నవీన్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్ వైస్ ఫ్లోర్ బొడ్ల ఆనంద్ బిజెపి నాయకులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్ పల్లి మున్సిపాలిటీలో 26 వార్డుల్లో అభివృద్ధి పనులు కోసం మంజూరైనటువంటి నిధులతోని వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని ప్రారంభించక పోతే పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి చేపడతామని మెట్ పల్లి మున్సిపాలిటీలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అభివృద్ధి పనులు ప్రారంభించాలని పూర్తి బాధ్యత అధికారుల దేననీ అధికార పార్టీకి చెందిన కొందరు అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేస్తూ అడ్డుపడుతున్నారని ఆయా పార్టీల నేతలు వారి పట్ల ఏ నిర్ణయం తీసుకుంటారో వారికి వదిలేస్తున్నామని ఈ రాజకీయ చదరంగంలో అధికారులు బలికాకుండా చూసుకోవాలని అభివృద్ధి విషయంలో భారతీయ జనతా పార్టీ కలిసి వస్తదని ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సమర శిల పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు అధికార పార్టీ నేతల అహంకారంతో అధికారులు మెట్ పల్లి మున్సిపాలిటీలో విధులు నిర్వహించడానికి భయపడుతున్నారని లాంగ్ లీవ్ బదిలీ లు పెట్టుకుంటున్నారని దానికి పూర్తి బాధ్యత అధికార పార్టీ బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు రాజకీయాలకతీతంగా అభివృద్ధి జరగాలి తప్ప అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయడం దుర్మార్గమని అన్నారు వర్షాకాలం దృశ్య పట్టణంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు వైకుంఠధామాలు అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అభివృద్ధి పనులకోసం సంబంధించిన నిధులు ఉన్నప్పటికీ ఆ కాంటాక్ట్లకు అగ్రిమెంట్ అయి రోజులు గడుస్తున్న కమిషనర్లకు కో సం అధికార పార్టీ నేతలు అడ్డుపడుతున్నారని విమర్శించారు ఈ యొక్క సమావేశంలో బిజెపి నాయకులు మిట్టపల్లి కృష్ణమూర్తి బత్తుల జగదీష్ నూనె క్రాంతి భాస్కర్, లోలపు అనిల్ పాసు కంటి శ్రీనివాస్ భాస్కరాచారి భోగ దత్తు రామస్వామి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular