Wednesday, June 17, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్లడ్డూల విక్రయ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు

లడ్డూల విక్రయ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు

📰 Generate e-Paper Clip

లడ్డుల కొరత లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. బిఆర్.నాయుడు

నవగీతం, తిరుపతి : తిరుమలలోని శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రంలో గురువారం  దేవస్థానం చైర్మన్ బి.ఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లడ్డూ నాణ్యత, బరువు, జారీ విధానం, సిబ్బంది పనితీరును స్వయంగా పరిశీలించడంతో పాటు భక్తుల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించారు.

దర్శనం కాని భక్తులకు ఆధార్ నమోదు ద్వారా యూ పి ఐ  చెల్లింపుతో లడ్డూలు పొందే విధానాన్ని, కియోస్క్ యంత్రాల పనితీరును మరియు బూందీ పోటులో లడ్డూ తయారీ ప్రక్రియను కూడా తనిఖీ చేసి అధికారులకు సూచనలు అందజేశారు.డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల దృష్ట్యా లడ్డూల కొరత లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం అని ప్రస్తుతం రోజుకు 4 లక్షల లడ్డూలు, 8 వేల కళ్యాణోత్సవ లడ్డూలను భక్తులకు అందిస్తున్నామని

లడ్డూల నాణ్యత, రుచి, క్యూ లైన్లలో వేచి ఉండే సమయం తగ్గడంపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసారని రాబోయే రోజుల్లో ఉత్పత్తిని మరింత పెంచి భక్తులకు త్వరితగతిన లడ్డూలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వీరితో దేవాలయ అధికారులు సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular