జిల్లా సహకార అధికారి సిహెచ్ మనోజ్ కుమార్
నవగీతం, కొడిమ్యాల
కొడిమ్యాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో బుధవారం కొడిమ్యాల రైతు వేదికలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని జిల్లా సహకార అధికారి సి.హెచ్. మనోజ్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగుతో రైతులకు మంచి లాభాలు వస్తాయని చెప్పారు. వంట నూనెల దిగుమతి తగ్గడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తోందని, పండిన పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చట్టం కూడా చేసిందని తెలిపారు. మండల రైతులు ఆయిల్ పామ్ సాగు దిశగా ముందుకు రావాలని కోరారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్ మాట్లాడుతూ, జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.విశిష్ట అతిథిగా పాల్గొన్న జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఆయిల్ పామ్ సాగుపై ఉద్యానవన, వ్యవసాయ, సహకార శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు వివరించారు.
నూతన సర్పంచులకు ఉప సర్పంచ్లకు వార్డు సభ్యులకు ఘనసన్మానం
కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇటీవల ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను ఐదు గ్రామ సంఘాల విఓఏలు, విఓ పాలకవర్గ సభ్యులు కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.అన్ని గ్రామాలతో పాటు కోనాపూర్, నర్సిములపల్లి, అప్పారావుపేట, రామకిష్టాపూర్, తిర్మలాపూర్, గౌరపూర్, రాంసాగర్, చింతలపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులకు కూడా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ కొడిమ్యాల పర్సన్ ఇన్‌చార్జ్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏ. మల్లేశం, మండల వ్యవసాయ అధికారి జ్యోతి, కొడిమ్యాల పీఏసీఎస్ కార్యదర్శి గంగాధర్, ఏపీఎంమల్లేశం, మండల సమాఖ్య అధ్యక్షురాలు పద్మ, సీసీ వీరకుమార్, మరియా, కమల, స్వరూప, మంగ, పంచాయతీ సెక్రటరీ వంశీ, విఓఏలు, విఓ అధ్యక్షులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

