Friday, April 17, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలశ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణకట్ట ప్రారంభం

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణకట్ట ప్రారంభం

📰 Generate e-Paper Clip

నవగీతం,కొడిమ్యాల:

​కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల చిరకాల వాంఛ నెరవేరింది. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్మాణ కమిటీ నూతనంగా ఏర్పాటు చేసిన కళ్యాణకట్టను సోమవారం ఉదయం ప్రారంభించారు. మొక్కుల చెల్లింపు ఇక సులభతరం భక్తులకు ఈ కళ్యాణకట్ట అందుబాటులోకి రావడంతో గొప్ప ఊరట లభించింది. ఇకపై భక్తులు తమ తలనీలాల మొక్కులను క్రమబద్ధమైన పద్ధతిలో, పరిశుభ్రమైన వాతావరణంలో సమర్పించుకోవచ్చు. ఈ సౌకర్యం పట్ల స్థానిక భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.​తొలి మొక్కులు సమర్పించిన అయ్యప్ప స్వాములు ​శబరిమల యాత్ర ముగించుకుని వచ్చిన సామ భాస్కర్ రెడ్డి గురుస్వామి బృందం, బల్ల మల్లేశం,(ఎల్లయ్య) పాసికంటి రాజేంద్రప్రసాద్, మొగిలి వరుణ్ కుమార్, ఆరే లక్ష్మారెడ్డి .ఈ కళ్యాణకట్టలో తొలిసారిగా తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఆశీస్సులు అందజేశారు.ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామని, భక్తులు క్రమశిక్షణతో, శుభ్రతను పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు పరిసర గ్రామాల భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular