Friday, April 17, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలచికిత్స పొందుతున్న బాలికకు వైరా లైన్స్ క్లబ్ రూ.10000 ఆర్థికసాయం

చికిత్స పొందుతున్న బాలికకు వైరా లైన్స్ క్లబ్ రూ.10000 ఆర్థికసాయం

📰 Generate e-Paper Clip

నవగీతం, వైరా

వైరాలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మునగాల సింహాద్రి సరోజినీ దంపతుల మూడేళ్ల కుమార్తె దురదృష్టవశాత్తు వేడివేడి గిన్నె లోని పప్పు మీద పడటంతో శరీరం కాలిపోయింది. ప్రస్తుతం హైదరాబాదులో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ కుటుంబానికి చిన్నారి వైద్య ఖర్చులు నిమిత్తం వైరా లయన్స్ క్లబ్ స్పందించారు.వైరాలోని శిరిడి సాయి మందిరంలో వైరా లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఏడు నూతల బుచ్చి రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైరా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పదివేల నగదు సహాయాన్ని బాధిత కుటుంబ బంధువుడు మునగాల పుల్లయ్యకు అందజేశారు.ఈ కార్యక్రమంలో వైరా లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఏడు నూతల బుచ్చి రామారావు, సెక్రటరీ చెరుకూరి శ్రీనివాసరావు, కోశాధికారి గద్దె నీరజ రీజియన్ సెక్రటరీ పెనుగొండ ఉపేంద్ర రావు, క్లబ్ సభ్యులు నల్లమోతు లక్ష్మీనారాయణ చింతలపూడి వెంకటేశ్వరరావు మాదినేని దుర్గాప్రసాద్ సాయిబాబా మందిర కమిటీ కోశాధికారి లగడపాటి బోసు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular