Tuesday, April 14, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్బాలసాహితోత్సవం సభకు వక్తగా గద్వాల సోమన్నకు ఆహ్వానం

బాలసాహితోత్సవం సభకు వక్తగా గద్వాల సోమన్నకు ఆహ్వానం

📰 Generate e-Paper Clip

నవగీతం,గుంటూరు

నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలసాహిత్యవేత్త, బాలబంధు గద్వాల సోమన్న  ఈ నెల 17న పిల్లల ప్రపంచం, సైన్స్ సెంటర్, తిరుపతి లో జరిగే “సాహితీ సంక్రాంతి బాలానందం బాలసాహితోత్సవంకు వక్తగా ఆహ్వానం బాలకవిమిత్ర గద్వాల సోమన్న ఈ సభలో “బడిలో బాలసాహిత్యం”అనే అంశంపై మాట్లాడనున్నారు.బాలల నేస్తం మాస పత్రిక తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో సాహితీ పండితులతో పాటు గణితోపాధ్యాయుడు గద్వాల సోమన్న పాల్గొనడం గమనార్హం.మట్టి పరిమళం వీరి 89వ పుస్తకాన్ని కూడా విచ్చేసే ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారని కార్యక్రమ నిర్వాహకులు యువ, మురళీ, డా. నెమిలేటి కిట్టన్న, విద్వాన్ గోవిందయ్య లు ఒక ప్రకటనలో అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular