నవగీతం,జగిత్యాల:
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఇందిర మహిళ శక్తి సంబరాలు కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణ మహిళా స్వశక్తి సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హాజరై మహిళా స్వశక్తి సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలను అందజేశారు.ఈ సందర్భంగా మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, మహిళా స్వశక్తి సంఘాలను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళల అభివృద్ధి ద్వారానే సమాజం అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా స్వశక్తి సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

