నవగీతం,కొడిమ్యాల:
కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామానికి చెందిన పద్మశాలి కుల పెద్దలు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.ఈ సమావేశంలో సంఘ భవిష్యత్తు కార్యాచరణ, కుల సంక్షేమం, సామాజిక సేవా కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించి, అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వడ్లకొండ మురళిని, ఉపాధ్యక్షులుగా సిరిసిల్ల సురేష్‌ను,ప్రధాన కార్యదర్శిగా వీరబాత్తిని గణేష్‌ను, కోశాధికారిగా ఐట్ల గంగాధర్‌ను, ఉప కార్యదర్శిగా పచ్చునురి సుకుమార్‌ను నియమించారు.అలాగే సంఘానికి మార్గదర్శకులుగా వ్యవహరించేందుకు గౌరవ సభ్యులుగా మ్యాకల గోపి, చెన్నూరి శంకర్, వడ్లకొండ దశరథం, వీరబాత్తిని శ్రీనివాస్, ఇట్టే రాజేశంలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, పద్మశాలి కుల ఐక్యతను మరింత బలోపేతం చేయడం, నిరుపేద కుటుంబాలకు సహాయ కార్యక్రమాలు నిర్వహించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను కుల సభ్యులకు చేరువ చేయడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాచుపల్లి గ్రామానికి చెందిన పద్మశాలి కుల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

