సముదాయించిన బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు
నవగీతం,ఇబ్రహీంపట్నం:
ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట గ్రామంలో త్వరలో ప్రతిష్టాపించడానికి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని గ్రామానికి తీసుకురాకుండా ఆదివారం కొంతమంది అడ్డుకోగా వారిని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు సముదాయించారు.కొద్ది రోజుల్లో జరిగే ప్రతిష్టాపనకు విగ్రహాన్ని గ్రామానికి తీసుకువస్తుండగా స్థానికులు కొంతమంది అభ్యంతరం తెలిపారు. ఆ విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు దృష్టికి కార్యక్రమ నిర్వాహకులు తీసుకెళ్లారు. వెంటనే డాక్టర్ రఘు హుటాహుటిన అమ్మక్కపేట చేరుకొని విగ్రహ రాకకు అభ్యంతరం తెలుపుతున్న వారితో మాట్లాడి వారిని సముదించారు.కాగా గ్రామానికి విగ్రహాన్ని తెప్పించడంలో సహకరించిన బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు కార్యక్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్ కుమార్ ,పోలీసు సిబ్బందికి డాక్టర్ రఘు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

