Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణపట్టణాభివృద్ధికి పట్టం కట్టండి..ఎమ్మెల్యే విజయరమణ రావు

పట్టణాభివృద్ధికి పట్టం కట్టండి..ఎమ్మెల్యే విజయరమణ రావు

📰 Generate e-Paper Clip

33 మంది అభ్యర్థుల ప్రకటన

నవగీతం,పెద్దపల్లి:

ప్రజాభిష్టానికి అనుగుణంగా నిజాయితీగా ప్రజా సేవ చేయడమే తన లక్ష్యమని,గత రెండేళ్లలో కోట్ల రూపాయలతో పెద్దపల్లి పట్టణ రూపురేఖలను మార్చామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పేర్కొన్నారు.ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు గాను 33 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులను ఆయన అధికారికంగా ప్రకటించారు.

అనంతరం రంగంపల్లి 10వ వార్డు మాజీ కౌన్సిలర్ గాదె మాధవి ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా,ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ రూ.77.50 కోట్లతో పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు.ఇందులో భాగంగా రూ.40 కోట్లతో సీసీ రోడ్లు,డ్రైనేజీ పనులు పూర్తి చేశామని,తాగునీటి సమస్య పరిష్కారానికి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో మరియు చందపల్లి డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద కొత్త వాటర్ ట్యాంకుల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.మార్కెట్ ఆధునీకరణకు రూ.7.5 కోట్లు,ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు రూ. 2.5 కోట్లు కేటాయించామన్నారు.రూ. 80 కోట్లతో పెద్దపల్లి బైపాస్ రోడ్డు టెండర్లు పూర్తయ్యాయని,రాఘవాపూర్ కోర్టు భవనానికి రూ. 80 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు.బస్ డిపో, ఆసుపత్రి విస్తరణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని, అధికార పార్టీ అభ్యర్థులనే గెలిపిస్తే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థులు1వ వార్డు-పూరేళ్ళ శైలజ,2వ వార్డు-లక్ష్మి పస్తం,3వ వార్డు-మొలగూరి కమల్,4వ వార్డు-కొమ్ము సుధాకర్,5వ వార్డు-గుజ్జుల కుమారస్వామి,6వ వార్డు-కట్ట పద్మావతి, 7వ వార్డు-ఈర్ల స్వరూప,8వ వార్డు-ఎరుకల కల్పన,10వ వార్డు-అక్కెపల్లి సుజాత,11వ వార్డు-అనూష పూదరి,12వవార్డు-దొడ్డుపల్లి జగదీష్,13వ వార్డు-పాగల శ్రీకాంత్,14వ వార్డు-మహమ్మద్ అస్లాం పర్వేజ్,15వ వార్డు-నేతెట్ల కొమురయ్య, 16వ వార్డు-నాంసాని శ్రీనివాస్, 17వ వార్డు-తోట ఫణీందర్,18వ వార్డు-భూతగడ్డ సంపత్,19వ వార్డు-నల్లాల పద్మ,20వ వార్డు-బండి రమ్యకృష్ణ,21వ వార్డు-నూగిళ్ళ మల్లయ్య,22వ వార్డు-ఉప్పు స్వరూప,23వ వార్డు-తాడూరి శ్రీమన్నారాయణ,24వ వార్డు-కొట్టే స్వరూప,26వ వార్డు-సూది మల్ల అమ్రేష్,27వ వార్డు-ఉనుకొండ సరస్వతి, 28వ వార్డు-తూముల లత,29వ వార్డు-ఇల్లందుల రజని, 30వ వార్డు-సాజిదాబాను,31వ వార్డు-మంథని నర్సింగ్,32వ వార్డు-తిర్రీ శ్రీలత, 33వ వార్డు-బూతగడ్డ స్వప్న,35వ వార్డు-దేవనంది రమాదేవి, 36వ వార్డు-ముస్కాన్ నాజ్ నయ్యర్ లు ఉన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు,ప్రజా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular